శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శనివారం ప్రారంభమవనున్న హనుమత్ రక్షాయాగం [పదవ ఆవృతి ]

>> Friday, November 17, 2017

హనుమత్ రక్షాయాగం పదవ ఆవృతి  కార్తీక అమావాస్య శనివారం ప్రారంభం కానున్నది.


 భగవద్బంధువులకు
నమస్కారం      . పరమాత్మ అనుగ్రహంతో  హనుమత్ రక్షాయాగం  తొమ్మిది ఆవృతులు  నిర్విఘ్నంగా  జరుపుకున్నాము. ఐ తొమ్మిది సంవత్సరాల కాలంలో  ఐ యాగసమయాన్ని తమ సాధనగా  కొనసాగించి సద్యోఫలితాలను పొంది  హనుమద్దేవుల  అనుగ్రహ శక్తిని,తమభక్తిని  ఎంతోమంది ఉదాహరణలుగా చూపారు.
ఇక ఇప్పుడు భూమిపై అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. . మానవుల సామూహిక చెడు కర్మ లు  సామూహికంగా అనుభవించేలా భూమిపై  విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి . వందలమంది శాస్త్రవేత్తలు  భూమి ప్రమాదకర స్థితిలో ఉన్నదని  ఓప్రకటన చేయటం రెండురోజులక్రితం  జరిగినది .
ఇక వ్యక్తిగతంగా గ్రహస్థితులు ముఖ్యంగా కర్మఫలదాత  శనీశ్చరులవారి  ప్రభావం తీవ్రంగా ఉంటున్నది .
యజ్ఞము  వ్యక్తిగతముగాను సామూహికముగాను  ఫలితాలనిస్తుంది.     హనుమత్ రక్షాయాగంలో పాల్గొనే  సాధకులందరి జీవితాలలోని చెడుకర్మలు  తొలగి సకలశుభాలు కలగాలని ,సామూహికంగా లోక హితము చేకూరాలని సంకల్పంతో   పదవ ఆవృతిని  ప్రారంభించటం జరుగుతున్నది

ఇక కార్తీక అమావాస్య శనివారం  [18-11-2017] ముహూర్తంగా నిర్ణయించటం  కూడా భగవంతుని ప్రేరణయే . విశేషమయిన ఫలితాలు చేకూరనున్నాయి సాధకులకు . పూర్ణాహుతి  మాఘశుధ్ధ  దశమి  [ 27-01-2018] న నిర్వహించబడుతుంది.   నిత్యమూ హనుమాన్ చాలీసా పారాయణము. ,శ్రీరామ నామ లేఖనము ,హనుమత్ ప్రదక్షిణలు  సాధనా క్రియలుగా చేకొని మిమి అభీష్టములు నెరవేర్చుకొనెదరుగాక . హనుమత్ప్రభువుల అనుగ్రహం మీపై సదా వర్షించుగాక.
జైశ్రీరామ్


[సమయం లేనందున వివరాలు అన్ని వ్రాయలేకపోతున్నాను. రేపు అన్ని వివరాలు వ్రాస్తాను ]

durgeswara@gmail.com
9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP