శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చైనా మీద యుద్దం ఇలా

>> Monday, July 10, 2017

1945 అగస్ట్ 6 న జపాన్ లొని హిరోషిమ మీద, అగస్ట్ 9 న నాగసాకి మీద అమెరికా "లిటిల్ బాయ్" అనే  కోడ్ నేమ్ కల అణు బాంబులను ప్రయోగించింది. సుమారు పది అడుగుల పొడవు కలిగి 6౭౦0 కేజీల బరువు కలగి ఉన్న ఈ బాంబు లక్షలాది జపాన్ వాసులను బలిగొంది.
          ఈ సంఘటన జరిగి 71 సంవత్సరాలు గడిచాయి . ఈ 71 సంవత్సరాల్లో అమెరికా జపాన్లో కనీసం గుండుసూదుల వ్యాపారం కూడ చెయ్యలేక పోయింది. దీనికి కారణం జపాన్ ఆంక్షలు కాదు.అంతర్జాతీయ వ్యాపార నియమాల ప్రకారం ఒక దేశం   మరొక దేశ వస్తువులను బహిష్కరించరాదు.కాని జపాన్ ప్రజలు అమెరికాలో తయారయ్యే  ఏ వస్తువును కొనుగోలు చెయ్యరు. అదీ వారి దేశాభిమానం...దేశభక్తి.

      మన విషయానికొద్దాం.....

           1962 లో చైనా తో జరిగిన యుద్ధం లో మన దేశం అప్పటి ప్రధాని (నెహ్రు) , రక్షణ మంత్రి(వీ.కృష్ణ మీనన్ )
వైఖరి , వ్యూహాత్మిక తప్పిదాల వల్ల సుమారుగా 70 వేల చదరపు మైళ్ళ భారత్ భూభాగాన్ని కోల్పోయింది.అందులో ప్రధానమైనది "అక్సాయ్ చిన్ " & లడక్ లొని కొంత   ప్రాంతం. 3086 మంది
మన వీర సైనికులు తుప్పుపట్టిన ,కాలం చెల్లిన తుపాకులతో పోరాడుతూ తమ విలువైన ప్రాణాలను తృణపాయంగా దేశమాత కొరకు అర్పించారు.

              మనదేశ ప్రజల విషయానికొస్తే చాలా బాధ కల్గుతుంది. పోయేది నా ,మా ప్రాణాలు కాదు ...కాబట్టి నా ఇష్టం అన్న రీతిలో ఉంది. మన ప్రధాన ,బలమైన   శత్రువు చైనాకు మనదేశమే ప్రదాన కొనుగోలుదారు.మనదేశ ప్రజల (కక్కుర్తి) ప్రేమతో 2015 లోన 29000 వేల కోట్ల వ్యాపారం ఇవ్వగా , నేడు అది 42 వేలకోట్లకు చేరుకుంది. మన  డబ్బుతొ  మనమే మనల్ని రక్షిస్తున్న సైనికులను చంపిస్తున్నాము.  ఏమిటి దౌర్భాగ్యం ...?
200 సంవత్సరాల తెల్ల దొరల పాలనలోని బానిస బతుకు సరిపోలేదా...? అంతకు ముందు మహ్మదీయుల పాలనలో ద్వితీయ  శ్రేణి పౌరసత్వాన్ని  మర్చిపోయారా...?

            దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు, చైనా ఉత్పత్తులు..! చైనా  అంటే చౌక కు పర్యాయపదంగా మారింది...కానీ  వాస్తవానికి ప్రపంచ వ్యాప్తాంగా
వ్యర్ధాలను అతి తక్కువకు కొని రీ సైకిలింగ్ చేసి వాటికి విషతుల్య రసాయనాలు కలిపి ముడి పదార్థంగా
చేసి ఉత్పత్తులు తయారు చేస్తారు .మేలు  రకమా అంటే...అది కాదు ,మన్నికలేని చౌకబారు వస్తువులు. వేతనాల విషయంలో మానవ హక్కుల  ఉల్లంఘనలో చైనా ప్రపంచంలోనే నెంబర్ 1.    చౌక ధరతో పాటు వాటితో వచ్చే   సకల వ్యాధులు,జబ్బులు,రోగాలు ఫ్రీ.

             ప్రస్తుతం డ్రాగన్ హుంకరింపులు
మీరందరు చూస్తున్నారు.ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.జపాన్ వాసులను స్ఫూర్తిగా  తీసుకోండి.మన దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మన వీర సైనికులకు వెన్నుదన్నుగా నిలవండి .మన ఐక్యత మన బలమని నిరూపిద్దాం. చైనా బజార్ కు వెళ్ళినవారు,చైనా   ఉత్పత్తులు కొన్నవారు దేశద్రోహులని నినదించండి .


గమనిక:- ఈ సందేశం చదివినవారు ఫార్వర్డ్ చెయ్యకపోయినా ఫర్వాలేదు కానీ కనీసం మీరైనా చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.

2 వ్యాఖ్యలు:

అలేఖ్య July 14, 2017 at 11:16 AM  

అంతా బాగానే ఉంది. ఈ గడ్డి మీరు హిందూ ప్రభుత్వానికెందుకు పెట్టరు? ఒక ప్రభుత్వమేమో సర్దార్ విగ్రహాన్ని నిర్మించే పని చైనా కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది మీరేమో దాన్ని తమలపాకుతో కూడా ఒకటనరు. చైనా తరహా డిక్టేటర్షిప్ కోరుకోవచ్చుగానీ, చైనా వస్తువులు వాడకూడదా?

శ్యామలీయం July 14, 2017 at 9:27 PM  

తములపాకుతోనైనా సరే తలుపుచెక్కతో నైనా సరే, చైనా వస్తువులమీది వ్యామోహాన్ని చక్కగా తప్పుపట్టవచ్చును. అది వ్యక్తులవ్యామోహమైనా సంస్థలవ్యామోహమైనా ప్రభుత్వాలవ్యామోహమైనా ఏవిధమైనా విచక్షణా చూపనవసరం లేదు. అన్నట్లు పార్టీలవ్యామోహమైనా మేధావులవ్యామోహమైనా సరే నిర్మొగమాటంగా తప్పుపట్టవచ్చును. చైనా తరహా ఐనా మరొకతరహా ఐనా నియంతృత్వాన్ని కోరుకోరాదు మనం. చైనావస్తువులు వాడరాదా అన్నది మీ విచక్షణమీద ఆధారపడి ఉంటుంది. బిందువులు కలిసి సింధువు అన్నట్లుగా ఒకదేశంలో‌ ప్రజల వ్యామోహం మరొకదేశం సొమ్ము చేసుకోవటం విడ్డూరం కాకపోయినా అలా ఆర్జించినసొమ్మునే ఆదేశంమీదనే అది ధాష్టీకం చేయటానికి వాడుకుందుకు ఒక వనరుగా ఉపయోగించుకొనే అవకాశాన్ని వీలైనంత తగ్గించటం మంచిదే. కాదూ ఎవరెలా పోతేనేం మాకు పట్టదూ మా యిష్టం మాది అంటారా, అలాంటి ప్రజలూ పాలకులూ ఉన్న దేశానికి అథోగతి పట్టకుండా ఎవరూ‌ రక్షించలేరు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP